Current Affairs Telugu Daily

కేంద్ర బడ్జెట్‌ 2019-20 ముఖ్యంశాలు 
* Bougette (భౌగొట్టి ) అనే ఫ్రెంచ్ పదం నుండి బడ్జెట్ అనే ఆంగ్ల పదం ఉద్బవించింది. 
* భౌగొట్టి అనగా తోలు సంచి అని అర్ధం. 
* సాధారణ భాషలో రాబడి వ్యయాల పట్టికను బడ్జెట్ అందురు. 
* ప్రపంచంలో మొట్టమొదటి సరిగా వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన దేశం ఇంగ్లాండ్. 
* 1860 లో జేమ్స్ విల్సన్ మొట్టమొదటిసారిగా ఇండియాలో బెంగాల్ ప్రాంతమునకు బడ్జెట్ ప్రవేశ పెట్టాడు 
* 1909 నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టుట ప్రారంభంమైనది. 
* 1924 ఆక్వార్త్ కమిటీ సిఫారసు మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ వేరుచేయుట జరిగింది.
* 1924 లో రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 
* రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. కానీ ఆర్టికల్ 112 ప్రకారం వార్షిక ఆర్ధిక నివేదికను ప్రతి సంవత్సరం పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించాలి. 
* ఆర్ధిక మంత్రిత్వ శాఖలో అంతర్భమైన డిపార్ట్మెంట్ అఫ్ ఎకనామిక్ అఫైర్స్ అత్యంత రహస్యంగా బడ్జెట్ ను తయారు చేస్తుంది. 
* స్వత్రంత్ర భారతదేశంలో మొట్టమొదటి బడ్జెట్ ను 1947 నవంబర్ 26 న RK షణ్ముఖ శెట్టి ప్రవేశపెట్టాడు 
* గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్ ను 1951 జాన్ మత్తయ్య ప్రవేశపెట్టాడు. 
* 1968 లో మొరార్జీదేశాయ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను People Centric Budget అంటారు. 
* 1973 బడ్జెట్ ను బ్లాక్ బడ్జెట్ అంటారు. కారణం రికార్డు స్థాయిలో 550 కోట్లు లోటు ప్రకటన. 
* 1986 VP సింగ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను The Carrot and Stick బడ్జెట్ అంటారు. 
* 1991 మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ను The Epochal బడ్జెట్ అంటారు
* ఫాదర్ అఫ్ ఇండియన్ బడ్జెట్ PC Mahalnobis. 
* మాజీ ఆర్థిక శాఖామంత్రి మోరార్జీ దేశాయి గరిష్ఠంగా 10 సార్లు బడ్జెట్‌ను రూపొందించారు.
* భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆర్థిక శాఖామంత్రిగా బాధ్యతలను స్వీకరించారు మరియు ఆర్థిక శాఖ పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా పేరుగాంచారు.
* ఆర్థిక శాఖను నిర్వహించిన మొట్టమొదటి రాజ్యసభ సభ్యుడు ప్రణభ్ ముఖర్జీ 1982-83, 1983-84 మరియు 1984-85ల్లో వార్షిక బడ్జెట్‌లను సమర్పించారు.
* 2017 నుండి బిబేక్ దేబ్రాయ్ కమిటీ సిఫారస్సుల మేరకు  రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ లో విలీనం చేసారు.
* 2017 బిమల్ జలాన్ సిఫారస్సుల మేరకు  నుండి బడ్జెట్ వ్యయంను Plan, Non Plan గా వర్గీకరించడాన్ని నిలివేయుట జరిగింది. 

కేంద్ర బడ్జెట్‌ 2019-20
* కేంద్ర బడ్జెట్‌ 2019-20ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 
* బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో పూర్తి స్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్‌ రికార్డు సృష్టించారు.
* పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి అదనపు సుంకం.
* బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంపు.
* డిజిటల్ లావాదేవీలు పెంచేందుకు చర్యలు.
* డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు రద్దు.
* డిజిటల్ చెల్లింపులపై ఖాతాదారులు, వ్యాపారుల వద్ద ఛార్జీలు రద్దు.
* బ్యాంకు ఖాతా నుంచి ఏడాదికి రూ. కోటి నగదు ఉపసంహరణ పరిమితి.
* ఉపసంహరణ పరిమితి రూ. కోటి దాటితే 2 శాతం టీడీఎస్.
* మధ్య తరగతి గృహ రుణాలపై కాస్త ఊరట.
* వడ్డీ రాయితీ రూ. 2 లక్షల నుంచి రూ. 3.50 లక్షలకు పెంపు.
* రూ. 45 లక్షల లోపు గృహ రుణాలపై రూ. 3.50 లక్షలు వడ్డీ రాయితీ.
* రూ. 5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు.
* పాన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డుతో ఐటీ రిటర్నుల దాఖలుకు అవకాశం.
* వార్షిక ఆదాయం రూ. 5 కోట్లు దాటిన వారికి సర్ ఛార్జి పెంపు.
* విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తెచ్చే ఆలోచన ఉంది.
* ప్రస్తుతం ఆ అంశం జీఎస్టీ మండలి పరిశీలనలో ఉంది.
* త్వరలో కొత్త సిరీస్ లో 1, 2, 5, 10, 20 రూపాయాల కొత్త నాణేలు విడుదల.
* అంధులు కూడా గుర్తించే విధంగా కొత్త నాణేలు విడుదల.
* వచ్చే ఐదేళ్లలో మౌలిక సదుపాయాల రంగానికి రూ. 100 లక్షల కోట్లు.
* ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుంది.
* ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకుండా పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తాం.
* పెట్టుబడుల ఉపసంహరణతో 2019-20లో రూ. లక్షా 5 వేల కోట్ల సమీకరణ లక్ష్యం.
* దేశ విదేశీ అప్పులు జీడీపీలో 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. 
* బ్యాంకింగ్ రంగం ప్రక్షాళనకు కట్టుబడి ఉన్నాం.
* నూతన దివాళా చట్టం ద్వారా దేశవ్యాప్తంగా రూ. 4 లక్షల కోట్లు మొండి బకాయిలు వసూళ్లు. 
*ఆరు ప్రభుత్వ బ్యాంకులను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాం.
*రుణపరిమితి పెంచేందుకు బ్యాంకులకు రూ. 70 వేల కోట్లు.
* అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం.
* రైతుల ఆదాయం రెట్టింపునకు జీరో బడ్జెట్ ఫార్మింగ్ కు ప్రాధాన్యం.
* భారత్ పాస్ పోర్టు ఉన్న ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు అందిస్తాం.
* స్వదేశానికి వచ్చాక 180 రోజుల కాలవ్యవధి నిబంధన తొలగింపు.
* స్వదేశానికి రాగానే ఎన్ఆర్ఐలకు ఆధార్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటాం.
* ఆఫ్రికా దేశాల్లో 18 రాయబార కార్యాలయాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి.
* ఇప్పటికే 5 దేశాల్లో రాయబార కార్యాలయాలు ప్రారంభం.
* దేశ వ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం.
* 17 పర్యాటక కేంద్రాలకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఏర్పాటు.
* కృత్రిమ మేధ, బిగ్ డేటా, రోబోటిక్స్ రంగాల్లో యువత శిక్షణకు ఏర్పాట్లు.
* స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు.
* ప్రతి స్వయం సహాయ బృందంలో ఒక్కో మహిళకు రూ. లక్ష వరకు ముద్ర రుణం. 
* జన్ ధన్ ఖాతా ఉన్న మహిళకు రూ. 5 వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం.
* ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్ఈడీ బల్సుల పంపిణీ.
* ఎల్ఈడీ బల్బుల ద్వారా రూ. 80 వేల కోట్ల విలువైన విద్యుత్ ఆదా. 
* రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు భారీ ప్రాజెక్టులు చేపడుతాం.
* స్వచ్ఛ భారత్ అభియాన్ కింద గ్రామీణ ప్రాంతాల ఘన వ్యర్థాల నిర్వహణ.
* గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలది ప్రత్యేక పాత్ర.
* మహిళల ప్రోత్సాహకంతోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వెలుగులు. 
* సోషల్ ఎంటర్ ప్రైజెస్ కు చేయూతకు ఎలక్ర్టానిక్ విధానంలో నిధుల సేకరణకు ప్రత్యేక వేదిక.
* సోషల్ స్టాక్ ఎక్సేంజీ పేరుతో ఎలక్ర్టానిక్ విధానంలో నిధుల సేకరణ. 
* ప్రస్తుతం లోక్ సభలో 78 మంది మహిళా ఎంపీలు ఉన్నారు.
* దేశవ్యాప్తంగా వృత్తి కళాకారుల కోసం స్ఫూర్తి పేరుతో క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.
* స్ఫూర్తి క్లస్టర్ల ద్వారా 50 వేల మంది వృత్తి కళాకారులకు లబ్ధి జరుగుతుంది.
* స్టాండప్ పథకం ద్వారా 300 మంది వ్యాపారవేత్తలు వెలుగులోకి వచ్చారు.
* దళితులు, గిరిజనుల కోసం స్టాండప్ ఇండియా కింద పెట్టుబడి సాయం. 
* దేశ వ్యాప్తంగా 10 వేల రైతు సంస్థలు ఏర్పాటు.
* శ్రమయోగి మాన్ ధన్ యోజన ద్వారా 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ. 3 వేలు పింఛను.
* గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు విస్తృత ప్రాధాన్యం కల్పిస్తాం.
* 2019-20 ఆర్థిక సంవత్సరంలో 80 జీవనోపాధి వ్యాపార అంకుర సంస్థలు ఏర్పాటు.
* 2019-20లో 20 సాంకేతిక అంకుర సంస్థలు ఏర్పాటు.
* యాస్పెర్ పథకం ద్వారా 75 వేల మంది నైపుణ్యవంతులైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దుతాం. 
* స్టార్టప్ ల కోసం ప్రత్యేక టీవీ ఛానల్.
* స్టార్టప్ లు, ఆవిష్కరణల ప్రోత్సాహకానికి టీవీ ఛానల్. 
* ఏడాదిలోగా ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు.
* ఖేలో ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా క్రీడలకు ప్రోత్సాహం కల్పిస్తాం.
* ప్రధానమంత్రి కౌశల్ యోజన ద్వారా కోటి మందికి నైపుణ్యాభివృద్ధి.
* దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు. 
* ఐదేళ్ల కిందట ప్రపంచ అత్యుత్తమ 200 విద్యా సంస్థల్లో భారత్ నుంచి ఒక్కటి కూడా లేదు.
* ఐదేళ్లలో నిరంతర శ్రమతో ఇప్పుడు మూడు విద్యాసంస్థలు 200 లోపు ర్యాంకుల్లో ఉన్నాయి.
* ఉన్నత విద్యా కేంద్రంగా ఎదిగేందుకు భారత్ కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
* మన ఉన్నత విద్యా సంస్థల్లోకి విదేశీ విద్యార్థుల రాక మరింత పెరగాలి.
* ఉన్నత విద్యలో సంస్కరణల కోసం నూతన విద్యా విధానం. 
* పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు.
* నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు ప్రత్యేక నిధులు. 
* నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలకు చేయూతనిస్తాం.
* ఉన్నత విద్యలో బోధన మెరుగుకు జ్ఞాన్ పథకం.
* స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా 9.6 కోట్ల శౌచాలయాల నిర్మాణం.
* 5.6 లక్షల గ్రామాలను ఓడీఎఫ్ గా ప్రకటించాం. 
* అక్టోబర్ 2 నాటికి ఓడీఎఫ్ భారత్ గా తీర్చిదిద్దాలని ప్రధాని సంకల్పం.
* మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా దేశం ఇచ్చే కానుక అదే. 
* ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్ల మంది గ్రామీణ యువతకు శిక్షణ అందించాం.
* శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణను ఒక అవకాశంగా చూస్తున్నాం.
* దేశ వ్యాప్తంగా పట్టణ పేదల కోసం 81 లక్షల ఇళ్ల నిర్మాణం.
* ఇప్పటికే 24 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు పంపిణీ.
* గ్రామీణ సడక్ యోజన ద్వారా రూ.80,250 కోట్లతో 1.25 లక్షల కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం.
* ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి 30 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం.
* మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన.
* విమానయానం, మీడియా, యానిమేషన్ రంగాల్లో ఎఫ్ డీ ఏల ప్రతిపాదనలపై పరిశీలన.
* రైతు ఉత్పత్తి సంఘాలకు మరింత చేయూతనిస్తాం.
* వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు పూర్తి సహాయ సహకారాలు.
* పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించినందుకు రైతులకు ధన్యవాదాలు.
* పప్పు ధాన్యాల ఉత్పత్తిలో రైతులు స్వయం సమృద్ధి సాధించి దిగుమతుల భారం తగ్గించారు. 
* జలవనరుల విభాగాలన్నీ సమీకృతం చేస్తూ జల్ శక్తి మంత్రాలయ్ ఏర్పాటు.
* జలజీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ రక్షిత నీరు.
* ఇప్పటికే ఉన్న రాష్ర్టాల పథకాలతో కలిసి లక్ష్యం దిశగా జలజీవన్ ఉంటుంది.
* వాననీటి సంరక్షణ, గృహ నీటి శుద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం. 
* ఇక నుంచి వచ్చే నీటిని తిరిగి సాగు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం.
* 256 జిల్లాల్లో జల్ శక్తి అభియాన్. 
* ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేర్చేందుకు 3 అంశాలపై దృష్టి పెట్టాం. 
* మౌలిక వసతుల రంగంలో భారీగా పెట్టుబడులు మొదటిది.
* డిజిటల్ ఎకానమీ, ఉపాధి కల్పనకు తదుపరి ప్రాధాన్యం.
* స్టాక్ మార్కెట్ లో ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు వెసులుబాటు.
* ఎన్ ఆర్ ఐల పెట్టుబడులకు విదేశీ పోర్టుఫోలియోగా గుర్తింపు.
* ప్రపంచంలోనే భారత్ సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరిస్తోంది.
* ఇస్రో సేవలను వాణిజ్యపరంగానూ వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ.
* గ్రామాలు, పేదరికం, రైతులే మన గ్రామీణ భారతం.
* గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు.
* ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి విద్యుత్.
* 2022 నాటికి దేశంలోని ప్రతి కుటుంబానికి విద్యుత్ సౌకర్యం.
* 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా లబ్ధి.
* ఇప్పట్నుంచి 2022 వరకు 1.95 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తాం. 
* చిల్లర వ్యాపారులకు నూతన పింఛన్ పథకం.
* ప్రధానమంత్రి కర్మయోగి మాన్ ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్.
* దేశానికి విదేశీ పెట్టుబడుల రాక స్థిరంగా కొనసాగుతోంది.
* అన్ని దేశాల్లో ఎఫ్ డీ ఐలు తగ్గినప్పటికీ భారత్ పై ఆ ప్రభావం పడలేదు. 
* ఎఫ్ డీ ఐల ఆకర్షణకు భారత్ ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతాం.
* ప్రపంచంతో పోలిస్తే భారత్ కు ఎఫ్ డీ ఐలు మెరుగ్గా ఉన్నాయి. 
* ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ద్వారా రైల్వేల్లో నూతన విధానం.
* 2030 నాటికి రైల్వేల మౌలిక వసతుల కోసం రూ. 50 లక్షల కోట్లు అవసరం.
* రహదారి, రైల్వే ప్రయాణికులకు ఒకే కార్డును ఉపయోగించుకోవచ్చు.
* అదే కార్డుతో ఏటీఎంలలో నగదు కూడా తీసుకోవచ్చు.
* భారత్ మాల, సాగర్ మాల, ఉడాన్ పథకాలు గ్రామీణ - పట్టణ ప్రాంతాల మధ్య దూరం తగ్గించనున్నాయి.
* భారత్ మాల పథకం ద్వారా రహదారులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం.
* నవ భారత్ నిర్మాణానికి 10 సూత్రాల విధానంతో ముందుకెళ్తాం.
* దేశ రవాణా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నాం.
* రవాణా వ్యవస్థలో దేశవ్యాప్తంగా ఉపయోగపడేలా నేషనల్ ట్రాన్స్ పోర్టు కార్డు తెస్తున్నాం.
* పవర్ టారిఫ్ పై త్వరలో కొత్త విధానం తీసుకువస్తాం. 
* ఎంఎస్ఎంఈలకు రాయితీ కోసం రూ. 350 కోట్ల నిధులు.
* ఎంఎస్ఎంఈలకు నిరంతర ఆర్థిక వెసులుబాటు కోసం ప్రత్యేక పథకం.
* వన్ నేషన్, వన్ గ్రిడ్ విధానంతో నిరంతర విద్యుత్ సరఫరా.
* వృద్ధి రేటు పెంచేందుకు భారీగా మౌలిక వసతులు ప్రాజెక్టులు చేపట్టాం.
* దేశ ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతుల ప్రాజెక్టులు జీవనరేఖలు. 
* భారతీయ సంస్థలు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తూ, సంపద సృష్టిస్తున్నాయి.
* మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్ మా విధానం. 
* పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తాం.
* నూతన అద్దె చట్టం తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం. 
* దేశంలో 2018-19 మధ్య 300 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చాం.
* దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657 కిలోమీటర్లు నిర్మితమై ఉంది. 
* విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నాం.
* దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం. 
* జలమార్గ్ వికాస్ పథకంతో అంతర్గత జల రవాణాకు అధిక ప్రాధాన్యం.
* రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలమార్గ్ వికాస్.
* గత ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అమలు చేశాం.
* పరోక్ష పన్నులు, నిర్మాణ రంగం, దివాళ స్మృతిలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చాం.
* ఐదేళ్లలోనే దేశ ఆర్థిక వ్యవస్థ విలువను లక్ష కోట్ల డాలర్లు పెంచాం.
* దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో పారిశ్రామిక రంగం కీలకపాత్ర పోషిస్తుంది.
* 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
* ఎన్డీఏ అధికారంలోకి వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 1.85 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
* ప్రస్తుతం భారత్ 2.5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల దేశం.
* జాతీయ భద్రతకు ప్రజలు ఆమోదం తెలిపారు.
* 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. 
* ప్రత్యక్ష పన్నులు, రిజిస్ర్టేషన్ లో అనేక మార్పులు తెచ్చాం.
* ప్రతి ఇంటికి మరుగుదొడ్ల సౌకర్యం, స్వచ్ఛభారత్ నిర్మితమైంది.

views: 1930

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams