Current Affairs Telugu Daily

రిటైర్మెంట్‌ ప్రకటించిన షోయబ్‌ మాలిక్‌
* పాకిస్తాన్‌ క్రికెటర్, భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త షోయబ్‌ మాలిక్‌ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికాడు.
* షోయబ్ మాలిక్ తన చివరి వన్డే మాంచెస్టర్ వేదికగా భారత్పై ఆడాడు.
* 1999లో తొలి వన్డే ఆడిన మాలిక్‌ 20 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
* 34.55 సగటుతో 7,534 పరుగులు చేశాడు. 39.19 సగటుతో 158 వికెట్లు పడగొట్టాడు.
* వ‌న్డేల‌లో షోయ‌బ్ మాలిక్ 9 సెంచ‌రీలు, 44 అర్ద సెంచ‌రీలు చేశారు.
* 2010 ఏప్రిల్‌ 12న వివాహబంధంతో సానియా- మాలిక్‌లు ఒక్కటైన విషయం తెలిసిందే.

views: 760



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams