Current Affairs Telugu Daily

స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించిన ట్రంప్‌
* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికాకు వందనం’ పేరుతో ప్రత్యేకంగా ప్రసంగించారు. 
* గత 70 ఏళ్లలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన తొలి అధ్యక్షుడిగా ఆయన నిలిచారు.
* ప్రస్తుతం తమ దేశం మునుపెన్నడూ లేనంత బలీయంగా ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. మిలిటరీ శక్తికి తోడుగా త్వరలో అంతరిక్ష బలగాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు.
* అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌, దేశ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ తదితరులు పాల్గొన్నారు. 
* 1776 జులై 4న బ్రిటన్‌ నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందింది.

views: 702

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams