Current Affairs Telugu Daily

 హైదరాబాద్ లో ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిస్ట్‌ సిస్టమ్‌(ఈబీఆర్‌టీఎస్‌) బస్సులు.
* ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిస్ట్‌ సిస్టమ్‌(ఈబీఆర్‌టీఎస్‌) ఆకాశ బస్సు మార్గాన్ని పట్టాలెక్కించే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. 
* కేపీహెచ్‌బీ మెట్రోస్టేషన్‌ నుంచి జెన్‌ఎన్‌టీయూ మీదుగా హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ వరకు ఆకాశ బస్సు మార్గాన్ని పూర్తిగా ప్రైవేటు నిధులతో నిర్మించనున్నారు. రూ.2600 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. 
* మూడు నెలల్లో సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌) రాగానే ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది. 
* మెట్రో ప్రతిపాదన కంటే ముందు 2004లోనే బీఆర్‌టీఎస్‌పై అధ్యయనం చేశాను. 
* ఈ రెండు మార్గాలను కలిపేలా దాదాపు 17కి.మీ. ఆకాశ బస్సు మార్గాన్ని హెచ్‌ఎండీఏ, టీఎస్‌ఐఐసీ, మెట్రో కలిసి చేపడుతున్నాయి. 
ఇవీ ప్రత్యేకతలు..
* మెట్రోతో పోలిస్తే ఛార్జీలు తక్కువ.
* రెండు బస్సులు అటు ఇటు రాకపోకలు సాగించేలా ఆకాశ రోడ్డు మార్గం.
* కాలుష్యరహితం.. ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు నడుపుతారు. డబుల్‌ ఆర్టిక్యూలెటెడ్‌ బస్సులివి. రెండు బస్సులు కలిపి ఉంటాయి. అవసరమైతే మూడో బస్సును జోడించుకోవచ్చు.
* అరకిలోమీటరకు ఒక స్టేషన్‌ ఉంటుంది. మెట్రో అంతా విశాలంగా కాకుండా చిన్న స్టేషన్లు వస్తాయి.
* మెట్రోలో వెళ్లినట్లే కార్డు, టోకెన్‌ స్టేషన్లలో స్వైప్‌ చేసి వెళ్లాలి.
అన్ని మార్గాలకు అనుసంధానంగా..
* ప్రతిపాదిత ఆకాశ బస్సు మార్గం ప్రధాన మెట్రో, ఎంఎంటీఎస్‌ స్టేషన్లను, కూడళ్లను, మెట్రో లేని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ కలుపుతూ వెళ్లబోతుంది.
* కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌
* హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌
* మైండ్‌స్పేస్‌ మెట్రో స్టేషన్‌(నిర్మాణంలో)
* రాయదుర్గంలోని ఎయిర్‌పోర్ట్‌ మెట్రో స్టేషన్‌(ప్రతిపాదన)
* గచ్చిబౌలి-మియాపూర్‌రోడ్‌ కూడలి(ప్రతిపాదన)

views: 807



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams