Current Affairs Telugu Daily

కజకిస్థాన్‌లో యురేనియం బ్యాంక్‌
కజకస్థాన్‌లో ఒక యురేనియం బ్యాంకును ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(IAEA) నిర్ణయించింది. అణు రియాక్టర్లకు ఉద్దేశించిన ఈ ముడి పదార్థాన్ని ఓస్కీమెన్‌ నగరంలో సోవియట్‌ యూనియన్‌ హయాం నాటి ఒక కర్మాగారంలో భద్రపరచనుంది. ఒకప్పుడు ఇక్కడ అణు బాంబుల్లో ఉపయోగించే అత్యంత శుద్ధ యురేనియాన్ని నిల్వ చేశారు. అయితే భద్రత చాలా బలహీనంగా ఉండటం వల్ల 1994లో అమెరికా ఒక కోవర్ట్‌ ఆపరేషన్‌ ద్వారా ఈ ఇంధనాన్ని అక్కడ నుంచి తొలగించింది. ఇప్పుడు మాత్రం ఆయుధ శ్రేణి యురేనియాన్ని ఉంచడం లేదు. తక్కువ స్థాయిలో శుద్ధి చేసిన ఇంధనాన్ని నిల్వ చేస్తారు. IAEA  సభ్యదేశాలు దీన్ని మార్కెట్‌ ధరకు పొందవచ్చు. అసాధారణ పరిస్థితుల్లో తమ అణుకర్మాగారాలకు ఇంధన సరఫరా ఆగిపోయినప్పుడు ఆయా దేశాలకు ఇది ఉపయోగపడుతుందని సంస్థ చెబుతోంది
IAEA-International Atomic Energy Agency

views: 872

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams