Current Affairs Telugu Daily

భారత్ టారిఫ్‌ల పెంపుపై డబ్ల్యూటీవోకు అమెరికా
* భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్‌నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను పెంచడంపై అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది.
* భారత్ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి ట్రేడ్, టారిఫ్‌ల సాధారణ ఒప్పందం (గాట్) కింద అమెరికాకు అందుతున్న ప్రయోజనాలను రద్దు చేయడం లేదా బలహీనపరచడం చేస్తున్నట్లు ఆరోపించింది.
* 2018లో భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచింది.
* జీఎస్‌పీ కింద భారత్‌కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా 2019, మే నుంచి నిలిపేసింది. 
* దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్‌లను జూలై నెల నుంచి పెంచింది.
* WTO ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఆర్థిక సంస్థ.
* WTO యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సెంట్రీ విలియమ్ రాపార్డ్‌లో ఉంది.
* WTO ప్రతి రెండు సంవత్సరాలకు సమావేశం జరుగుతుంది
* GATT చివరి డైరెక్టర్ జనరల్ అయిన ఆర్డర్ డంకల్ దేశాల మధ్య విభేదాలను నేర్పుతో పరిష్కరించి తాత్కాలిక ఒప్పందం అయిన GATT బదులు WTO స్థాపించాలని ప్రతిపాదించారు. 
* 1994 మొరాకో లోని మారాకేష్ నగరంలో సభ్యదేశాలు సమావేశం అయి GATT ని రద్దు చేసి దాని స్థానంలో WTO ను ఏర్పాటుకు నిర్ణయం. 
* 1995 జనవరి 1 న జెనీవా కేంద్రంగా భారత్ సహా 128 దేశాల సభ్యత్వంతో WTO ఆవిర్భవించింది. 
* ప్రస్తుతం WTO డైరెక్టర్ జనరల్ "ROBERTO AZEVEDO" (బ్రెజిల్)
* ప్రస్తుతం WTO లో సభ్యదేశాల సంఖ్య 164. 
* 163 సభ్యదేశం లైబీరియా.
* 164 సభ్య దేశం ఆఫ్గనిస్తాన్.

views: 676

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams