Current Affairs Telugu Daily

మాజీ సైనిక కుటుంబాలకు పింఛను పథకం
* మాజీ సైనిక కుటుంబాలకు ప్రత్యేక పింఛను పథకం అందించేందుకు వీలు కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ జూలై 4న ఆదేశాలు జారీ చేసింది.
* ఈ పథకం ప్రకారం విధి నిర్వహణలో గాయపడి రిటైరైన సైనికుడు పౌర ఉద్యోగం పొంది, రిటైరై మరణిస్తే అతని వారసులకు ప్రత్యేక కుటుంబ పింఛను కింద సైనిక/పౌర ఉద్యోగాలకు సంబంధించిన రెండు పింఛన్లు అందుకునే వీలుంటుంది. 
* 2013 జనవరి 17వ తేదీకి పూర్వం పౌర విభాగాల్లో నియమితులైన మాజీ సైనికోద్యోగులు రిటైరై మరణించిన సందర్భాల్లో అతని కుటుంబసభ్యులు పౌర, సైనిక పింఛన్లలో ఏది ఎక్కువగా ఉంటే దానినే సాధారణ కుటుంబ పింఛనుగా డ్రా చేసుకునేందుకు వీలుండేది.

views: 710



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams