Current Affairs Telugu Daily

వైద్య మండలి బిల్లుకు పార్లమెంటు ఆమోదం
* భారత వైద్య మండలి(సవరణ) బిల్లు-2019కు పార్ల్లమెంటు జూలై 4న ఆమోదం తెలిపింది.
* అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంసీఐకి బదులుగా గవర్నర్ల బోర్డు 2018, సెప్టెంబర్ 26 నుంచి మరో రెండేళ్ల పాటు పాలన నిర్వహించనుంది. 
* బోర్డు సభ్యుల సంఖ్యను 7 నుంచి 12కు పెంచుతారు.
* ఈ బిల్లును లోక్‌సభ జూన్ 2న ఆమోదం తెలిపింది. 
* భారతదేశ వైద్య మండలిని ఆంగ్లంలో సంక్షిప్తంగా ఎంసిఐ (MCI) అంటారు.
* భారతదేశ వైద్య విధానంలో ఉన్నత ప్రమాణాల కోసం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
* భారత మెడికల్ కౌన్సిల్ చట్టం, 1933 క్రింద భారతదేశ వైద్య మండలి 1934లో మొదట స్థాపించబడింది.
* ఈ కౌన్సిల్ తరువాత భారత మెడికల్ కౌన్సిల్ చట్టం, 1956 క్రింద పునర్నిర్మించబడి పూర్వపు చట్టం స్థానంలోకి మార్చబడింది. 
* ఈ నేపథ్యంలో ఈ కౌన్సిల్ భారతదేశ అధ్యక్షునిచే అధిగమించబడి దాని విధులు గవర్నర్ల బోర్డుకు అప్పగించబడ్డాయి.
* ఈ కౌన్సిల్ భారతదేశంలో వైద్య అర్హతలకు గుర్తింపునివ్వటం, వైద్య కళాశాలలకు నిపుణత హోదానివ్వటం, వైద్య అభ్యాసకులను నమోదు చేయటం, మరియు వైద్య ప్రాక్టీస్‌ను పర్యవేక్షిస్తుంది.

views: 676



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams