Current Affairs Telugu Daily

క్రికెట్ క్రీడాకారుడు బ్రయాన్ లారాకు పాటిల్ వర్శిటీ డాక్టరేట్
* వెస్టిండీస్‌కి చెందిన క్రికెట్ క్రీడాకారుడు బ్రయాన్ లారాకు ముంబైలోని డీవై పాటిల్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది.
* జూలై 4న జరిగిన ఈ కార్యక్రమంలో లారా డాక్టరేట్‌ను అందుకున్నాడు.
* తన ఆల్ టైం ఫేవరెట్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అని చెప్పాడు. 
* 1969, మే 2 న జన్మించిన బ్రియాన్ లారా (Brian Charles Lara) వెస్టిండీస్‌కి చెందిన మాజీ క్రికెట్ కెప్టెన్.
* 15 సంవత్సరాల వయస్సులోనే వెస్ట్‌ఇండీస్ తరఫున అండర్-19 టీమ్‌లో స్థానం పొందినాడు.
* 34 టెస్ట్ శతకాలు సాధించి సచిన్ టెండూల్కర్ తర్వాత రెండో స్థానంలో నిల్చాడు.
* వెస్ట్‌ఇండీస్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్
* టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని దేశాలపై సెంచరీలు సాధించాడు.
* టెస్ట్ క్రికెట్‌లో 2 ట్రిపుల్ సెంచరీలను, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 2 క్వాడ్రుపుల్ సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్.
* అతను సాధించిన సెంచరీలలో 9 డబుల్ సెంచరీలు. ఈ విషయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ బ్రాడ్‌మెన్ తర్వాత ద్వితీయ స్థానంలో ఉన్నాడు.
* వెస్ట్‌ఇండీస్ టీం స్కోరులో 20% పరుగులు సాధించాడు. ఈ విషయంలో డాన్ బ్రాడ్‌మెన్ (23%) మరియు జార్జ్ హీడ్లీ (21%) మాత్రమే ఇతనికంటే ముందున్నారు.
* 2001-02 లో శ్రీలంకపై 3 టెస్టుల సీరీస్ లో 688 పరుగులు సాధించాడు. 3 టెస్టుల సీరీస్ లో ఇది రెండో అత్యధిక సీరీస్ స్కోరు. అంతేకాకుండా ఈ సీరీస్ లో వెస్టీండీస్ చేసిన పరుగులలో ఇది 42%.
* 2006లో పాకిస్తాన్ పై 77 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. వేగవంతమైన సెంచరీలలో ఇది 9వ స్థానంలో ఉంది.
* 164 క్యాచ్‌లు పట్టి అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్లలో ఆస్ట్రేలియాకు చెందిన మార్క్ వా తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు.
*1994లో బి.బి.సి.స్పోర్ట్స్ పర్సనాలిటీ అవార్డు సాధించాడు.
*1995లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా ఎన్నికయ్యాడు.

views: 665

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams