Current Affairs Telugu Daily

మేఘాలయకు వంద కోట్ల జరిమానా
* అక్రమ బొగ్గు తవ్వకాలను అరికట్టడంలో విఫలమైనందున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) విధించిన రూ .100 కోట్ల జరిమానాను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)లో జమ చేయాలని మేఘాలయ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు జూలై 3న ఆదేశించింది.
* నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జనవరి 4న మేఘాలయ ప్రభుత్వానికి జరిమానా విధించింది.
* గౌహతి హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కకోటి నేతృత్వంలోని కమిటీ నివేదిక ప్రకారం, మేఘాలయలో 24 వేల గనులుండగా, ఎక్కువ భాగం అనుమతులు లేనివేనని పేర్కొంది.
* జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం 2010 ప్రకారం 18.10.2010 న జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్థాపించబడింది.
* National Green Tribunal Chairman - Adarsh Kumar Goel

views: 712

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams