Current Affairs Telugu Daily

వేతనాల కోడ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
* వేతనాల కోడ్ బిల్లుకు కేంద్ర కేబినెట్ జూలై 3న ఆమోదం తెలిపింది.
* ప్రస్తుతం కార్మికులు, ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న
   వేతనాల చెల్లింపు చట్టం-1936,
   కనీస వేతన చట్టం-1948,
   బోనస్ చెల్లింపు చట్టం-1965,
   సమాన వేతన చట్టం-1976లను రద్దుచేసి వేతనాల కోడ్ చట్టాన్ని తీసుకొస్తారు.
* బిల్లు చట్టరూపం దాల్చితే కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుంది. 
* దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సులభతర వాణిజ్యంలో భారత్ స్థానం మెరుగై  విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించడం వీలవుతుంది. 
* బిల్లు ప్రకారం రైల్వేలు, గనులుసహా కొన్ని విభాగాల్లో అందించే వేతనాలను కేంద్రం ఖరారు చేస్తుంది. 
* మిగిలిన రంగాల్లో వేతనాలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. 
* ఈ కనీస వేతనాలను ప్రతి ఐదేళ్లకోసారి సమీక్షిస్తామన్నారు. 

views: 703

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams