Current Affairs Telugu Daily

వరి, తృణధాన్యాల  కనీస మద్దతు ధర
* వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.65 (3.7 శాతం) పెంచింది. దీంతో క్వింటాల్ వరి మద్దతు ధర రూ.1,815కు పెరిగింది.
* ఉత్పత్తి వ్యయానికి కనీసం రూ.1.5 రెట్లు అధికంగా ఉండేలా మద్దతుధరలను నిర్ణయించాలని గతేడాది ప్రభుత్వం ప్రకటించిన మేరకు వీటిని పెంచుతున్నట్లు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వెల్లడించాడు. 
* 2019-20 పంట సీజన్‌కు (జూలై-జూన్) గానూ సాధారణ, ఏ గ్రేడ్ రకం వరికి రూ.65 చొప్పున మద్దతు ధర పెంచినట్లు చెప్పారు.
*  ఈ ఏడాది సాధారణ వరి క్వింటాల్ ధర రూ.1,815కు, ఏ గ్రేడ్ రకం వరి ధర రూ.1,835కు పెరిగింది. 
* వరితోపాటు నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఇతర తృణధాన్యాల జొన్న - 120 రూ. ,రాగులు  - 253.  కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. 
కనీస మద్దతు ధర
* 1948 VT కృష్మచారి కమిటీ ఆహార ధాన్యాల దరల విధాన కమిటీ మద్దతు దరల విధానం ప్రవేశ పెట్టటానికి సూచించారు. 
* 1957 అశోక్ మెహతా కమిటీ నాట్లు వేసే సమయంలో MSP ప్రకటించాలని సిఫారసు చేసింది. 
* 1964 LK జా కమిటీ MSP నిర్ణయంచటానికై శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేయాలనీ సిఫారసు చేసింది
* 1965 న్యూ ఢిల్లీ కేంద్రంగా APC (అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్) ఏర్పాటు. 
* 1985 లో APC పేరును CACP గా (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్ ) గా మార్పు 
* CACP : chairman Vijay Paul Sharma

views: 841

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams