Current Affairs Telugu Daily

ఐఎన్‌ఎఫ్‌ ఒప్పందంరద్దుపై పుతిన్‌ సంతకం
* అణ్వాయుధాల పరిధిపై రష్యా, అమెరికా మధ్య 1987లో కుదిరిన ఇంటర్మీడియట్‌ రేంజ్‌ న్యూక్లియర్‌ ఫోర్సెస్‌ (ఐఎన్‌ఎఫ్‌) ఒప్పందాన్ని రష్యా అధికారికంగా రద్దు చేసింది.
* 1987 డిసెంబర్‌లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియట్‌ జనరల్‌ సెక్రటరీ మిఖాయిల్ గోర్బచేవ్ దీనిపై సంతకాలు చేశారు.
* 1980లో అమెరికా సెనేట్‌, రష్యా తమ దేశాల్లో ఈ ఒప్పందానికి ఆమోదం తెలుపుకొన్నాయి. 
* ఈ ఒప్పందాన్ని రష్యా తరుచూ ఉల్లంఘిస్తోందని  ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దీని నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
* రష్యా మళ్లీ మధ్య శ్రేణి అణు క్షిపణులను తయారు చేసే అవకాశం ఉంది.

views: 777

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams