Current Affairs Telugu Daily

పీఎన్‌బీ సహా నాలుగు బ్యాంకులకు జరిమానా
* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), యూకో బ్యాంక్, అలహాబాద్‌ బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులకు ఆర్‌బీఐ రూ.1.75 కోట్ల జరిమానాలు విధించింది.
* కేవైసీ అవసరాలు, కరెంటు ఖాతాల ప్రారంభానికి సంబంధించి నిబంధనలు పాటించకపోవడమే కారణం.
* పీఎన్‌బీ, అలహాబాద్‌ బ్యాంకు, యూకో బ్యాంకులకు ఒక్కో దానికి రూ.50 లక్షల చొప్పున, కార్పొరేషన్‌ బ్యాంకుపై రూ.25 లక్షల జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ తెలిపింది.
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు
* పంజాబ్ నేషనల్ బ్యాంకు (Punjab National Bank - PNB)ను 1895లో లాహోర్ లో లాలా లజపతి రాయ్ గారు స్థాపించారు.
* Punjab National Bank Slogan ; The name you can bank upon
* భారతీయులు భారతదేశంలో స్థాపించిన బ్యాంకులలో ఇది మొదటిది.
* ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4500 పైగా శాఖలతో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంకుగా కొనసాగుతున్నది.
* పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ : Sunil Mehta
అలహాబాద్‌ బ్యాంకు
* భారతదేశంలోని పురాతనమైన బ్యాంకులలో అలహాబాదు బ్యాంకు (Allahabad Bank) ఒకటి. 
* 1865లో ఈ బ్యాంకు నిర్వహణ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదులో ప్రారంభమైంది. 
* దీని ప్రధాన కార్యాలయం 1923లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా
* అలహాబాదు బ్యాంకు MD & CEO :    Shri CH. S. S. Mallikarjuna Rao

views: 705



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams