Current Affairs Telugu Daily

సర్పంచ్‌కే హరితహారం బాధ్యత
* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన హరితహారం బాధ్యత మొత్తం గ్రామ సర్పంచ్‌లపైనే వేసింది.
* నూతన పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొన్న నిర్ణయాలను మరోసారి వివరిస్తూ పంచాయతీరాజ్‌శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
* సర్పంచ్‌లు తొలి టాస్క్‌గా హరితహారాన్ని నిర్వహించాలని సూచించింది. 
* ప్రతీ ఇంటి ముందు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడంతోపాటు వాటి సంరక్షణ బాధ్యత కూడా సర్పంచ్‌లదేనని పేర్కొన్నారు.
* తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం.
* హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు, ఒకేరోజు లక్షమంది 163 కిలోమీటర్ల పొడవునా నిలబడి మొక్కలు నాటి రికార్డు సృష్టించడం జరిగింది.
* ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు.
* తెలంగాణాలో మొదటి హరితహారం కార్యక్రమం 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లో చిలుకూరు బాలాజీ దేవాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది.
* రెండవ విడుత హరితహారం కార్యక్రమం 2016 జులై 8 నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే అధికారికంగా ప్రారంభించబడింది.
* 2016 లోనే 46 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.
* మూడవ విడుత హరితహారం కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్ద మానవ ప్రయత్నంగా చేపట్టిన తెలంగాణ హరితహారం 2017 జులై 12 కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు డ్యామ్ వద్ద కెసిర్ ప్రారంభించారు .
* నాల్గవ  విడుత హరితహారం 2018 ఆగస్ట్ 1 గజ్వేల్ లోని ఇందిరాపార్క్ దగ్గర కెసిర్ ప్రారంభించారు .

views: 721

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams