Current Affairs Telugu Daily

ఏపీకి రూ. 8,654, తెలంగాణకు రూ.5375.29 కోట్లు విడుదల లోక్‌సభలో కేంద్రం వెల్లడి
* ఆర్థిక సంఘం(14వ) గ్రాంట్ల రూపంలో 2015-16 నుంచి 2019-20 వరకు ఏపీ పంచాయతీలకు రూ.8654.09 కోట్లు, తెలంగాణలోని పంచాయతీలకు రూ.5375.29 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం తెలిపింది. * తలసరి సగటున రూ.488 చొప్పున ఆర్థికసాయం చేసినట్లు కేంద్రం తెలిపింది.
కేంద్ర రాష్ట్రల  మధ్య, రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల మధ్య వనరుల విభజన సూచనల కోసం ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘాలను నియమిస్తారు. 
* ప్రస్తుతం అమలులో ఉన్న 14వ ఆర్థిక సంఘాన్ని 2013, జనవరి 2న నియమించారు. 
* అధ్యక్షుడిగా డా. వైవీ రెడ్డి, శాశ్వత సభ్యులుగా సుష్మానాథ్, గోవిందరావు, సుదిప్టో ముండేల్, తాత్కాలిక సభ్యునిగా అభిజిత్‌సేన్, కమిషన్ కార్యదర్శిగా అజయ్ నారాయణ నియమితులయ్యారు. 
* ఈ కమిషన్ సూచనలు 2015-20 మధ్యకాలంలో అమలవు తాయి. 
* 15 వ ఆర్థిక సంఘం ఛైర్మ‌న్ గా కేంద్ర మాజీ రెవెన్యూ కార్య‌ద‌ర్శి ఎన్ కే సింగ్ ని ప్ర‌భుత్వం నియ‌మించింది.
* 15 వ ఆర్థిక సంఘం  సిఫారసులు ఏప్రిల్ 1 2020 నుండి 2025 మర్చి 31 వరకు అమల్లో ఉంటుంది. 

views: 665

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams