Current Affairs Telugu Daily

భారత్‌కు ‘నాటో భాగస్వామి’ హోదా
* అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సభ్య దేశాలతో సమాన హోదాను భారతదేశానికి కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును సెనేట్‌ ఆమోదించింది.
* ఈ బిల్లును ప్రతినిధుల సభ (హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌)లో నెలాఖరులోగా ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
* ప్రతినిధుల సభలోనూ బిల్లు ఆమోదం పొందితే ఇజ్రాయెల్‌, దక్షిణ కొరియా వంటి దేశాల మాదిరిగా అమెరికాతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకొనేందుకు వీలుకలుగుతుంది. * హిందూమహాసముద్రం ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సముద్రపు దొంగతనాలను అడ్డుకోవటానికి, సముద్రంలో భద్రత విషయంలో అమెరికా తోడ్పాటునందిస్తుంది.
* ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలను కలుపుకొని బలపడిన సోవియట్‌ యూనియన్‌ను అడ్డుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాలు నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌(నాటో)ను ఏర్పాటు చేశాయి.
* 1949 ఏప్రిల్‌ 4న ఇది ఆవిర్భవించింది.
* అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, కెనడా, పోర్చుగల్‌, ఇటలీ, నార్వే, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ తదితర దేశాలు దీనిపై సంతకాలు చేశాయి.
* ప్రస్తుతం ఐరోపా, ఉత్తర అమెరికాలోని 29+1 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. మరో 22 దేశాలు నాటో ‘శాంతి భాగస్వామ్యం’లో పాలుపంచుకుంటున్నాయి.
* ఈ దేశాల వైశాల్యం ప్రపంచంలో 70% భూభాగం కావడం గమనార్హం. 
* 2018 లో మాటెనీగ్రో 29వ సభ్య దేశంగా చేరింది. 
* 30 వ సభ్య దేశంగా కొలంబియా చేరాయి. 
* నాటోలో చేరనున్న తొలి లాటిన్ అమెరికా దేశంగా కొలంబియా గుర్తింపు పొందింది. 
* నాటో ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్ (బెల్జియం)

views: 766

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams