* ఆస్కార్ పురస్కారాల అకాడమీలో భారతీయులకి చోటు దక్కింది. వారిలో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, పాపులర్ దర్శకులు అనురాగ్ కశ్యప్, గల్లీ బాయ్ డైరెక్టర్ జోయా అక్తర్‌తో పాటు రితేష్ బత్రా, శ్రీనివాస్ మోహన్ ఉన్నారు.
* శ్రీనివాస్ మోహన్ ఇటీవల భారీ బడ్జెట్‌తో తెరకెక్కి విడుదలైన బాహుబలి 2, 2.ఓ చిత్రాలకి విజువల్ ఎఫెక్ట్స్ అందించారు.
* 2019 సంవత్సరానికి గాను ఆస్కార్ అకాడమీ సభ్యులుగా మొత్తం 842 సభ్యులు ఎంపిక కాగా, అందులో మన భారతీయులకి చోటు దక్కింది.
* ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్ దక్కించుకునే చిత్రాలని పరిశీలించి వారిలో విజేతలని ఎంపిక చేసే విషయంలో భాగస్వాములు కానున్నారు. గత ఏడాది షారూఖ్ ఖాన్, నసీరుద్దీన్ షా, టబు, మాధురీ దీక్షిత్‌కి ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే .
* మొట్ట మొదటి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం మే 16, 1929లో హాలీవుడ్ లోగల హోటల్ రూజ్వెల్ట్ లో జరిగింది.
* నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ మరియు విలియం డెమిలీ కలిసి ఆస్కార్ ఏర్పాటు చేశారు.
గతంలో ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్న భారతీయులు
1. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయినా తొలి భారతీయ చిత్రం మదర్ ఇండియా (1958), రెండవ చిత్రం సలామ్ బాంబే (1988), మూడవ చిత్రం లగాన్ (2002)
2. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి భాను ఆథాయా (1982)
3. ఆస్కార్ లైఫ్ టైం అవార్డు పొందిన ఏకైక భారతీయుడు మరియు తొలి అసియా వాసి సత్యజిత్ రే
4. AR రహమాన్ సంగీత విభాగంలో 2 ఆస్కార్ పొందిన తొలి భారతీయుడు.
5. గుల్జార్ ఒరిజినల్ సాంగ్ గా ఎంపికైన జయహో పాట రచనకు గాను AR రహమాన్ తోపాటు ఈ అవార్డు పొందారు.
6. రసూల్ పూకుట్టి సౌండ్ మిక్సింగ్ విభాగంలో ఈ అవార్డు పొందాడు.
7. స్మైల్ పింకీ అనే చిత్రం డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఎంపికై ఆస్కార్ అవార్డు పొందింది.
views: 757