Current Affairs Telugu Daily

ప్రపంచం మొత్తం ఉష్ణోగ్రతలలో జూన్ రికార్డు
* అత్యధిక ఉష్ణోగ్రతలతో గత జూన్ మాసం రికార్డులకెక్కింది. 
* గతేడాదితో పోలిస్తే, ప్రపంచవ్యాప్తంగా జూన్ నెలలో సాధారణం కంటే 0.1 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, యూరప్‌లో 2 డిగ్రీల సెంటీ గ్రేడ్ మేర అధికంగా రికార్డయ్యాయని యూరోపియన్ యూనియన్ ఆధ్వర్యంలో పనిచేసే కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సంస్థ వెల్లడించింది.
*  ఫ్రాన్స్, జర్మనీ, ఉత్తర స్పెయిన్, ఇటలీలలో సాధారణం కంటే 10 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వివరించింది.
* ప్రపంచ వాతావరణ సంస్థ స్విట్జర్లాండ్  లోని జెనీవా లో ఉంది. 
* భారత వాతావరణ పరిశోధన సంస్థ మహారాష్ట్రలోని పూనాలో ఉంది 
* తెలంగాణాలో వాతావరణ పరిశోధన సంస్థ హైదరాబాద్ లోని బేగంపేట్ లో ఉన్నది. 

views: 624

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams