Current Affairs Telugu Daily

(ఇస్టా) ఉపాధ్యక్షుడిగా భారత్ నుంచి తొలిసారిగా ఎన్నికైన డాక్టర్ కే కేశవులు
* అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఇస్టా) ఉపాధ్యక్షుడిగా తెలంగాణ విత్తన ధ్రువీకరణ, విత్తనాభివృద్ధి సంస్థల డైరెక్టర్ డాక్టర్ కే కేశవులు ఎన్నికయ్యారు.
* 1924లో ఏర్పాటైన ఈ సంస్థలో భారతదేశానికి ఉపాధ్యక్ష స్థానం లభించడం ఇదే మొదటిసారి.
* ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అవసరాలకు అనుగుణంగా విత్తనచట్టాలను, పాలసీలను, మార్కెట్‌లో విత్తన నాణ్య త, నియంత్రణ, సరఫరా తదితర అంశాలపై తీసుకొనే నిర్ణయాల్లో ఇస్టా కార్యనిర్వహణ కమి టీ ప్రధానపాత్ర పోషిస్తుంది. 
* ఇస్టా కమిటీలో ప్రెసిడెంట్, వైస్‌ప్రెసిడెంట్‌తోపాటు ఎనిమిది మంది సభ్యులు ఉంటారు.
* డాక్టర్ కేశవులు ఉపాధ్యక్ష పదవిలో 2022 వరకు కొనసాగుతారు. ఆ తర్వాత సంస్థ నిబంధనల ప్రకారం ఇస్టా అధ్యక్షుడిగా కేశవులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
* ఇస్టా సంస్థ శత వార్షికోత్సవం కేశవులు నేతృత్వంలోనే జరిగే అవకాశం ఉన్నది. వచ్చే అంతర్జాతీయ విత్తన సదస్సు 2022ను న్యూజిలాండ్‌లో నిర్వహించాలని తీర్మానించారు.
ఇస్టా నూతన కార్యవర్గం
ఇస్టా కార్యనిర్వాహణ కమిటీ అధ్యక్షుడిగా స్టీవ్‌జోన్స్ (కెనడా), ఉపాధ్యక్షుడిగా డాక్టర్ కే కేశవులు (భారత్), కార్యవర్గసభ్యులుగా క్లెయిడ్ ముజాజు (జింబాబే), వాలేరి కొకరేల్ (బ్రిటన్), శైల్వీ డ్యూకోర్నో (ఫ్రాన్స్), బెర్టా కిల్లర్‌మన్ (జర్మనీ), రిటా జేకే నెల్లీ (ఇటలీ), రూయెల్ సీ గెస్‌ముండో (ఫిలిప్పీన్స్), లీనా పియెట్‌ల్లా (ఫిన్లాండ్), ఇగ్నోషియో అర్నషియాగ (అర్జెంటీనా) ఎన్నికయ్యారు.
* ఇస్టా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ కే కేశవులు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 
* ఇంటర్మీడియట్ వరకు వరంగల్ జిల్లాలో చదువుకొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూరు అగ్రికల్చరల్‌వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 
* యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పోస్ట్ డాక్టరల్ పరిశోధనలు చేసి విత్తనశాస్త్రంలో అనుభవం గడించారు. 
* ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ వర్సిటీలో విత్తనశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేశారు. 
* యూఎస్‌ఏఐడీ భాగస్వామ్య సభ్యుడిగా ఈస్ట్ ఆఫ్రికన్, సౌత్ ఆసియా దేశాల్లో విత్తన పద్ధతుల అభివృద్ధిపై అధ్యయనం చేశారు. 
* విత్తననిల్వలో ఆహారధాన్యాల నష్టాన్ని తగ్గించేవిధంగా అంతర్జాతీయంగా అంగీకరించిన వినూత్న సాధారణ విత్తననిల్వ పద్ధతులను కనిపెట్టారు. 
* ఇస్టా, ఓఈసీడీ నేపాల్ అగ్రికల్చర్ రీసెర్చ్ కౌన్సి ల్, ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీఏబీఐ ఆఫ్రికా, సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఆఫ్ టాంజానియా, బంగ్లాదేశ్‌తో కలిసి విత్తనరంగం అభివృద్ధికి కృషిచేశారు.

views: 622



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams