Current Affairs Telugu Daily

500 ఏళ్లనాటి గురుద్వారాను భారతీయుల కోసం తెరిచిన పాకిస్తాన్.
* పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో 500 ఏళ్ల నాటి గురుద్వారా దర్శనానికి నేటి నుంచి భారతీయ సిక్కులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు.
* ఇప్పటివరకు పాకిస్తాన్‌లో ఉన్న గురుద్వారాకు యూరప్‌, కెనడా, అమెరికా నుండి వచ్చే సిక్కులకు మాత్రమే అనుమతి ఉంది.
* ఈ జాబితాలో భారతీయ సిక్కు యాత్రికులను కూడా చేర్చాలని పంజాబ్‌ గవర్నర్‌ మొహ్మద్‌ సర్వార్‌ ఆదేశించారు.
* పంజాబ్‌‌లోని గురుద్వారాను దర్శించుకునేందుకు పాకిస్తాన్, యూరోప్, కెనడా, అమెరికాలకు చెందిన యాత్రికులకు ఇప్పటికే అనుమతి ఉంది.
* భారత సిక్కు యాత్రికులు సిక్కు మత స్థాపకుడైన గురునానక్‌తోపాటు ఇతర సిక్కు గురువుల జయంతి, వర్థంతి సందర్భాల్లో పాకిస్తాన్‌లో గురుద్వారాను సందర్శిస్తుంటారు.

views: 614Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams