Current Affairs Telugu Daily

తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ సాయం పెంపు
* కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సాయాన్ని 25 శాతం పెంచింది. 
* కల్యాణ లక్ష్మి’పేరిట రూ.1,00,116 అందజేస్తుండగా, ఇక నుంచి దివ్యాంగులైన పెళ్లి కూతురు తల్లి బ్యాంకు ఖాతాలో రూ.1,25,145 నగదు జమ చేయాలని నిర్ణయించింది.
* ఈ కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకం తల్లి తండ్రుల వార్షిక ఆదాయం 2 లక్షలు మించనివారికి ఈ పథకం వర్తిస్తుంది. 
* ఈ పథకం ద్వారా మార్చి 2018 నాటికి 3,65,000 మందికి లబ్ధి చేకూరింది
* 2018 - 2019 బడ్జెట్ లో కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకానికి 1450 కోట్లు కేటాయించిరి 
* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ పథకం 2014, అక్టోబర్ 2న ప్రవేశపెట్టిన పథకం.
* తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అక్టోబరు 2, 2014 నుంచి ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చారు.
*ఈ ఆర్థిక సహాయాన్ని మొత్తాన్ని పెళ్లి కుమార్తె పేరిట అకౌంట్ పే చెక్ ద్వారా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు

views: 767



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams