Current Affairs Telugu Daily

జపాన్‌లోని  ఒసాకాలో 14వ జీ20 సదస్సు
* జపాన్‌లోని ఒసాకాలో జూన్ 28, 29 తేదీల్లో 14వ జీ20(గ్రూప్ ఆప్ 20) సదస్సు జరిగింది.
* ఈ సదస్సులో 19 దేశాల అధినేతలతోపాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
* ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం-పెట్టుబడులు, సృజనాత్మకత, పర్యావరణం-శక్తి, ఉద్యోగ కల్పన అంశాలే ప్రధాన లక్ష్యంగా జీ20 నేతలు చర్చలు జరిపారు.

జీ-20 గురించి.
* ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక సహకారం కోసం అంతర్జాతీయ వేదికగా జరిగే ముఖ్యమైన సదస్సుల్లో జీ-20 ఒకటి. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి జీ-20 కూటమిని ఏర్పాటు చేశాయి. * ఈ సదస్సులో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్య విధానం సహా పలు కీలకాంశాలపై సభ్య దేశాల అధినేతలు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు చర్చలు జరుపుతారు.
* ఆసియన్ ఆర్థిక సంక్షోభం తర్వాత అంతర్జాతీయ ద్రవ్య స్థిరీకరణకు అవలంబించాల్సిన విధానాల రూపకల్పన కోసం 1999లో జీ-20ని ఏర్పాటు చేశారు.
* అమెరికాలోని వాషింగ్టన్ డీసీ నగరంలో 2008లో జీ-20 తొలి సమావేశం జరిగింది.
* ప్రపంచ జీడీపీలో 85 శాతం జీ-20 దేశాలు కలిగి ఉంటాయి.
* మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం జీ-20 దేశాల ద్వారానే జరుగుతుంది.
* ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ-20 దేశాల్లో ఉన్నారు.
* జీ20 సదస్సుకు 2008 నుంచి స్పెయిన్ శాశ్వత ఆహ్వానిత దేశంగా ఉంది.
* 2019 సదస్సుకు నెదర్లాండ్‌‌స, స్పెయిన్, థాయ్‌లాండ్, చిలీ, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్, సెనెగల్‌లను ఆహ్వానించారు.
* వరల్డ్ బ్యాంక్, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి సంస్థలు జీ20 సదస్సుకు హాజరవుతుంటాయి.
* 2019 సదస్సుకు నెదర్లాండ్‌‌స, స్పెయిన్, థాయ్‌లాండ్, చిలీ, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్, సెనెగల్‌లను ఆహ్వానించారు.
* 15వ 2020 జీ20 సదస్సు - రియాద్, సౌదీ అరేబియా లో జరుగనుంది.

జీ20 సభ్యదేశాలు 
ఈయూ, భారత్,చైనా,జపాన్,కెనడా,దక్షిణ కొరియా,యూకే, సౌదీ అరేబియా, అమెరికా, ఇండోనేషియా, మెక్సికో, బ్రెజిల్, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా, ఇటలీ, ఆస్ట్రేలియా, రష్యా, అర్జెంటీనా, టర్కీ, జర్మనీ

views: 849

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams