Current Affairs Telugu Daily

ఆగస్టు 12 నుంచి ముందస్తు జనగణన

*దేశవ్యాప్తంగా 2021లో నిర్వహించే జనగణనకు సంబంధించి పూర్వపరీక్ష జనాభా లెక్కింపును ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సస్‌ కమిషనర్‌ వివేక్‌ జోషి ప్రకటించారు.
* ఈ లెక్కింపును అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు.
* భారత్‌కు సంబంధించి 140 ఏళ్ల జనాభా లెక్కింపు చరిత్రలో తొలిసారిగా సమాచారాన్ని మొబైల్‌ యాప్‌ ద్వారా సేకరించాలని ప్రతిపాదించారు.
* జనగణకుల్ని సొంత ఫోన్లను ఉపయోగించేలా ప్రోత్సహించనున్నారు. 2021 జనాభా లెక్కింపు ప్రపంచంలోనే అతిపెద్ద గణన కార్యక్రమంగా నిలిచిపోనుందని  పేర్కొన్నారు.
** 33 లక్షల మంది జనగణకుల్ని సమాచార సేకరణ కోసం మోహరించనున్నారు.
* జనగణన అనేది కేవలం జనాభా సంఖ్యను లెక్కించే కార్యక్రమమే కాదని, ఇది ఎంతో విలువైన సామాజిక ఆర్థిక సమాచారాన్ని అందజేస్తుందని, విధాన నిర్ణయాలు, వనరుల కేటాయింపునకు విశ్వసనీయ ఆధారంగా పని చేస్తుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబ తెలిపారు. 
 *2021 జనగణన కార్యక్రమాన్ని రెండు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో గృహాల జాబితా రూపొందించే కార్యక్రమం సాగుతుంది.
* 2020 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య ఏవైనా రెండు నెలల్లో దీనిని నిర్వహిస్తారు.
* రెండోదశలో వాస్తవిక జనాభా లెక్కింపును చేపడతారు. 2021 ఫిబ్రవరి 9-28 వరకు జనాభా లెక్కింపును నిర్వహిస్తారు.మార్చి 1 నుంచి 5 వరకు పునఃపరిశీలన జరుగుతుంది.
* జమ్మూకశ్మీర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోని మంచు ప్రాంతాల్లో 2020 సెప్టెంబర్‌ 11 నుంచి 30 వరకు జనగణనను, అక్టోబర్‌ 1 నుంచి 5 వరకు పునఃపరిశీలనను చేపడతారు.
* 2021 జనగణనకు రిఫరెన్స్‌ తేదీని ఆ ఏడాది మార్చి 1గా నిర్ణయించగా, జమ్మూకశ్మీర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లలోని మంచు ప్రాంతాలకు 2020 అక్టోబర్‌ 1గా నిర్ణయించారు.

  • సెన్సస్ అనగా Door to door  survey ద్వారా శాస్త్రీయ పద్ధతిలో జనాభా మరియు ఇతర అనుబంధ సేకరించే పధ్ధతి 
  • 1841లో ఆధునిక సెన్సస్ మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఇంగ్లాండ్. 
  • 1851 లో సెన్సస్ ప్రవేశపెట్టిన రెండో దేశం న్యూజిలాండ్.
  • 1872 ఇండియా మొట్ట మొదటి సెన్సస్ నివేదిక ప్రచురణ లార్డ్ మేయో ప్రవేశపెట్టాడు 
  • 1881 లో ప్రతి పది సంవత్సరాల కొకసారి జనాభా లెక్కల సేకరణ విధానం భారత్ లో ప్రారంభమైంది. దీనిని ప్రారంభించింది లార్డ్ రిప్పన్ 
  • 1948 లో సెన్సస్ చట్టం చేయబడినది.
  • 2011 సెన్సస్ కమిషనర్ గా డా. చంద్రమౌళి నియమితులయ్యారు. 
  • ప్రస్తుతం సెన్సస్ కమిషనర్ వివేక్ జోషి.
  • 2011 సెన్సస్ దేశంలో 15వ నివేదిక మరియు స్వాతంత్య్రం అనంతరం 7వది.
  • కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో సెన్సస్ కమిషన్ ఉంటుంది.

views: 722

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams