Current Affairs Telugu Daily

జలశక్తి అభియాన్‌ 
*దేశంలో నానాటికీ తరిగిపోతున్న జల వనరులను సంరక్షించుకొని, వాన నీటిని ఒడిసి పట్టుకొనేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు జలశక్తి అభియాన్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది.
* గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నీటి పొదుపు, సంరక్షణ, పునర్వినియోగాలను ప్రోత్సహించే దిశగా కార్యాచరణను ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని నీటికి ఇబ్బందిపడుతున్న 256 జిల్లాలు, 1592 బ్లాకుల్లో రెండు దశల్లో నిర్వహించదలచిన ప్రచార ఉద్యమాన్ని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌  ప్రారంభించారు. కేంద్రం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.    
 *తొలి దశ కార్యక్రమాలు నిర్వహించే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన 24 జిల్లాలు, 137 బ్లాకులను ఇందుకు ఎంపిక చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌ (9 జిల్లాలు, 64 బ్లాకులు), తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చెరి రెండో దశలోకి వస్తాయి.
*ప్రతి రాష్ట్రంలో అక్కడి అదనపు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తారు.
* జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఒక్కో బ్లాకుకు ఇద్దరు అధికారులను బాధ్యులుగా నియమిస్తారు.
*ఈ కార్యక్రమం జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు తొలి దశ లో  నిర్వహిచనున్నారు 
*అక్టోబర్ 1 నుంచి నవంబర్ ౩౦ వరకు మలి దశ లో  నిర్వహిచనున్నారు.
*ఐదు అంశాల ఫై ప్రత్యేక దృష్టి ;  నీటి పరిరక్షణ, వాన నీటి సంరక్షణ.
* సాంప్రదాయ జలవనరు,కుంటలు,చెరువులు పునరుద్దరణ.
*పునర్వినియోగమైనా రీఛార్జికి వీలై న  నిర్మాణాలు చేపట్టడం.
*వాటర్ షె డ్ అభివృద్ది.
* పెద్ద ఎత్తున అటవీకరణ కార్యక్రమo 

views: 1435

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams