Current Affairs Telugu Daily

ఉచితం కానున్న ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌ సేవలు
* డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ మరో అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇకపై నగదును పెద్దమొత్తంలో బదిలీ చేయడానికి వినియోగించే ఆర్టీజీఎస్‌(రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌), నెఫ్ట్‌( నేషనల్ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్‌) ఛార్జీలను ర‌ద్దు చేసింది. 
* ఇది జులై 1వ తేది నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. ఆర్టీజీస్‌లో అయితే ఎక్కువ మొత్తంలో, నెఫ్ట్‌ విధానంలో 2 లక్షల వరకు నగదును బదిలీ చేసుకోవచ్చు. 
* గతంలో ఆర్టీజీఎస్‌ పద్ధతిలో సొమ్ము బదిలీకి రూ.5 నుంచి రూ.50, నెఫ్ట్‌ పద్ధతిలో రూ.1 నుంచి రూ.5 వసూలు బ్యాంకులు వసూలు చేసేవి. 
* ఈ చర్యతో డిజిటల్‌ బ్యాంకు లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ‘భారత బ్యాంకు సమాఖ్య’ ఛైర్మన్‌ సునీల్‌ మెహతా పేర్కొన్నారు.

views: 702



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams