Current Affairs Telugu Daily

ప్రపంచ  తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోల ఆవిష్కరణ 
ప్రపంచ  తెలుగు మహాసభలు, సాహిత్య అకాడమీ లోగోలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017 జులై 11న ఆవిష్కరించారు. తెలుగు మహాసభల లోగోను చేర్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రవిశంకర్‌ రూపొందించగా, సాహిత్య అకాడమీ లోగోను సిద్దిపేటకు చెందిన శిల్పి ఎంవీ రమణారెడ్డి తయారు చేశారు. 
ప్రపంచ  తెలుగు మహాసభల లోగో...
ప్రపంచ తెలుగు మహాసభల లోగోలో కాకతీయ తోరణం, మధ్యలో తెలంగాణ చిత్రపటం, కాకతీయ సామ్రాజ్య చిహ్నాలైన గజరాజులను నకాషీ చిత్ర రీతిలో పొందుపరిచారు. లోగో పైభాగంలో తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను చిత్రించారు. ‘మన తెలంగాణము తెలుగు మాగాణము’ అనే వాక్యం ఇందులో కనిపిస్తోంది.
సాహిత్య అకాడమీ లోగో.. 
సాహిత్య అకాడమీ లోగో మధ్య ఫిలిగ్రీ శైలిలో హంసను చిత్రించారు. హంసముక్కు స్థానంలో పాళి కనిపిస్తుంది. లోగో పైభాగంలో తెలంగాణ పటంలో సాహిత్య వృక్షం శాఖోపశాఖలు విస్తరిస్తున్నట్లు ప్రతీకాత్మకంగా పొందుపరిచారు. లోగో మధ్యలో పాల్కురికి సోమన పద్యభాగం ‘సరసమై బరగిన జానుతెనుగు’ అనే పద్యపాదాన్ని ప్రముఖంగా చేర్చారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ - నందిని సిధారెడ్డి
తెలంగాణ అధికార భాషా సంఘం అధ్యక్షుడు- దేవుపల్లి ప్రభాకర్‌రావు
తెలంగాణ గ్రంథాయ సంస్థ ఛైర్మన్‌ - ఆయాచితం శ్రీధర్‌

views: 1135

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams