Current Affairs Telugu Daily

‘మాంటిస్సోరి’ కోటేశ్వరమ్మ కన్నుమూత
* ‘మాంటిస్సోరి’ విద్యాసంస్థల అధినేత వేగె కోటేశ్వరమ్మ(94) కన్నుమూశారు.
* 1925 మార్చి 5న కృష్ణాజిల్లా గోసాలలో కోటేశ్వరమ్మ జన్మించారు. గుంటూరు, కాకినాడలో విద్యను అభ్యసించారు.
* 1979-80లో నాగార్జున వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.
* విజయవాడ, నెల్లూరులో విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.
* ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించే ఉద్దేశంతో 1955లో ‘చిల్డ్రన్స్‌ మాంటిస్సోరి పాఠశాల’ను విజయవాడలో స్థాపించారు. 
* కోటేశ్వరమ్మ కృషిని గుర్తించిన ప్రభుత్వం 1971లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
* ‘భారతదేశంలో స్త్రీలు’, ‘నేటి మహిళా ప్రపంచం’, ‘జాతి జ్యోతులు’, ‘భారతదేశంలో స్త్రీవిద్య- ఒక పరిశీలన’ తదితర 57 పుస్తకాలు రాశారు.
* మహిళా చైతన్యం, సాధికారత ధ్యేయంగా ‘ఇల్లు ఇల్లాలు’ మాసపత్రికను నిర్వహించారు. 
* 1945లో విజయవాడలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన తొలిమహిళగా కోటేశ్వరమ్మ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.
* సేవలకు గుర్తింపుగా 92ఏళ్ల వయస్సులో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది.

views: 736

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams