Current Affairs Telugu Daily

సుప్రీంలో ఏపీ ఏవోఆర్‌గా నాగేశ్వర రెడ్డి
* సుప్రీం కోర్టులో ఆంధ్ర ప్రదేశ్‌ తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డ్‌ (ఏవోఆర్‌)గా సీనియర్‌ న్యాయవాది జీ నాగేశ్వర రెడ్డి నియమితులయ్యారు.
* కర్నూలు జిల్లాకు చెందిన నాగేశ్వర రెడ్డి 1991 నుంచి న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. 
* 1994 నుంచి 1995 వరకు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కౌన్సిల్‌గా పనిచేశారు.
* 2005 నుంచి అప్పటి ఉమ్మడి రాష్ట్రాంలో ఉన్న ఏపీఎండీసీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, విద్యుత్తు డిస్కాం సంస్థలకు సుప్రీం కోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా సేవలు అందించారు. 
* 2010 నుంచి 2015 ఫిబ్రవరి వరకు సుప్రీం కోర్టులో ఏపీ తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డుగా వ్యవహరించారు.
* ఏవోఆర్‌గా నియమితులవ్వడం ఇది రెండో సారి.

views: 742



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams