Current Affairs Telugu Daily

GIAN  పథకంలో ఉస్మానియా యూనివర్సిటీ  
కేంద్ర మానవవనరుల శాఖ అమలు చేస్తున్న గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆఫ్‌ అకడమిక్‌ నెట్‌వర్క్స్‌ (GIAN) పథకంలో ఉస్మానియా యూనివర్సిటీ  చేరింది. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రొఫెసర్లతో పాఠ్యాంశాలు బోధిస్తూ లోతైన, క్లిష్టమైన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు కేంద్ర మానవవనరుల శాఖ 2015-16 విద్యాసంవత్సరం నుంచి గ్లోబల్‌ ఇనిషియేటివ్‌ ఆఫ్‌ అకడమిక్‌ నెట్‌వర్క్స్‌ (GIAN) పేరిట పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకాన్ని మొదటి సంవత్సరం 2015-16లో ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకునేలా నిబంధన విధించారు. 2016-17లో ప్రభుత్వరంగంలోని స్వయంప్రతిపత్తి కళాశాలలకు కూడా వర్తింపజేశారు. దీంతో జేఎన్‌టీయూహెచ్‌ దీన్ని వినియోగించుకుంది. ఐఐటీ హైదరాబాద్‌, ఎన్‌ఐటీ వరంగల్‌, నల్సార్‌, హెచ్‌సీయూ కూడా విదేశీ ఆచార్యులను రప్పించాయి. ఈ ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని టెక్నాలజీ కళాశాల కూడా పథకంలో చేరింది. ఈ పథకానికి ఐఐటీ ఖరగ్‌పూర్‌ సమన్వయకర్తగా వ్యవహరిస్తోంది. విదేశీ ప్రొఫెసర్ల బోధనల కోసం విశ్వవిద్యాయాలు ఐఐటీ ఖగర్‌పూర్‌కు సమగ్ర ప్రతిపాదన పంపించుకోవాలి. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని సబ్జెక్టు నిపుణుల బృందం దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది.
GIAN-Global Initiative of Academic Networks

views: 978



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams