Current Affairs Telugu Daily

శ్రీశ్రీ రవిశంకర్‌కు రష్యా వర్సిటీ డాక్టరేట్‌
* ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు రష్యాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఉరల్‌ ఫెడరల్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ అందజేసింది. 
* భారత్‌-రష్యాల మధ్య మైత్రిని పెంపొందించడంలో ఆయన చేసిన కృషికి గాను ఈ గౌరవం దక్కింది.
* శ్రీశ్రీ రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘విద్యతోపాటు మానవత్వం, విలువల్లో బోధన ముఖ్యమన్నారు. సాంకేతికతతో జీవితాలు పెనవేసుకుపోయాయి. అయితే.. హృదయాలను పెనవేసుకుపోయే విద్య అవసరం’’ అని అన్నారు.
* శ్రీశ్రీ రవిశంకర్‌తో వర్సిటీ రెక్టార్‌ విక్టర్‌ కోక్షరోవ్‌ ఓ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం.. ఒడిసాలోని శ్రీశ్రీ విశ్వవిద్యాలయం, ఉరల్‌ ఫెడరల్‌ యూనివర్సిటీలు పలు అంశాల్లో పరస్పర సహకారాన్ని అందిపుచ్చుకుంటాయి.

views: 686

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams