Current Affairs Telugu Daily

దక్షిణ మధ్య రైల్వేకు 4 పురస్కారాలు
*  జాతీయస్థాయిలో దక్షిణ మధ్య రైల్వే నాలుగు కీలక విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పురస్కారాలు సాధించింది.
* 2018–19 సంవత్సరానికిగాను ట్రాఫిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్, పర్సనల్‌ మేనేజ్‌మెంట్, సివిల్‌ ఇంజనీరింగ్, స్టోర్స్‌ విభాగాల్లో ఈ పురస్కారాలను దక్కించుకుంది. ముంబైలో జరిగే 64వ రైల్వే వారోత్సవాల్లో రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
* ట్రాఫిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ పురస్కారం: రైల్వే బోర్డు నిర్ధారించిన లక్ష్యం కంటే 10 శాతం అధికంగా సరుకు రవాణా చేసింది. 122.51 మిలియన్‌ టన్నుల సరుకును రవాణా చేసింది.
* పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ షీల్డ్‌: ఉద్యోగుల సంక్షేమ, ఉల్లాస కార్యక్రమాలు నిర్వహించటంలో ముందంజలో నిలిచింది.
* స్టోర్స్‌: తుక్కును విక్రయించటం ద్వారా ఏకంగా రూ.340 కోట్లు సాధించి బోర్డు లక్ష్యం కంటే 17 శాతం ఎక్కువ పనితీరు కనబరిచింది.
* సివిల్‌ ఇంజనీరింగ్‌: నిర్ధారిత లక్ష్యం కంటే ముందుగానే కాపలాలేని లెవల్‌ క్రాసింగ్‌లను తొలగించి దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. బాలాస్ట్‌ క్లీనింగ్‌ మెషీన్‌లు వినియోగించి 628 కి.మీ. నిడివి గల రైలు పట్టాల పునరుద్ధరణ పనులు చేపట్టింది. 

views: 656

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams