Current Affairs Telugu Daily

జూలై 1 నుంచి జల్‌శక్తి అభియాన్
* దేశవ్యాప్తంగా 2019, జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు (ఎంపిక చేసిన జిల్లాల్లో నవంబరు వరకు) ‘జల్‌శక్తి అభియాన్ (జేఎస్‌ఏ)’ అమలు చేయనున్నారు.
* దేశంలోని ప్రతి ఇంటికీ 2024 నాటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించనున్నట్లు జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ వెల్లడించారు.
* జల్‌శక్తి అభియాన్‌లో భాగంగా దేశంలో తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్‌ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమిస్తూ జూన్ 26న కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 * జిల్లా ఇన్‌ఛార్జులు ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తారు.

views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams