Current Affairs Telugu Daily

ఇరాక్‌లో రాముడి ఆనవాళ్లు గుర్తించిన అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం
* ఇరాక్‌లోని హోరేన్ షైక్ ప్రాంతంలో ఉన్న దర్బాండ్ ఐ బెలూలా కొండపై రాముడి ఆనవాళ్లను గుర్తించినట్లు అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం తెలిపింది.
* తాము గుర్తించిన రెండు చిత్రాలు దాదాపు 2 వేల ఏళ్ల కిందటిదిగా భావిస్తున్నట్లు పేర్కొంది. 
* ప్రాచీన కాలంలో అత్యున్నత నాగరికతలుగా పేరుపొందిన సింధు, మెసపటోమియా నాగరికతల మధ్య సంబంధాన్ని వీటి ద్వారా గుర్తించే అవకాశం కలుగుతుందని అయోధ్య శోధ్ సంస్థాన్ బృందం తెలిపింది.
* ఈ చిత్రాలలో ఓ చేతిలో విల్లు, బాణాలు, ఒరలో కత్తి ఉన్న ఆజానుబాహుడిని రాముడిగానూ, ఆయన ఎదురుగా మోకాళ్లపై ఉన్న మరో వ్యక్తిని హనుమంతుడిగానూ భావిస్తున్నట్లు వివరించింది.
* ఇరాక్ పరిశోధకులు మాత్రం ఇది ఓ కొండజాతి రాజు చిత్రమని, రాజుల ఎదుట మోకాలిపై ఉన్నవారిని ఖైదీలుగా భావిస్తామని చెబుతున్నారు. 

views: 601

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams