Current Affairs Telugu Daily

సంస్థాన్‌ నారాయణపురం ఠాణాకు 14వ ర్యాంకు
* యాద్రాది భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌సేష్టన్‌కు అరుదైన గౌరవం దక్కింది. 
* కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే బీపీఆర్‌డీ (బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ ఉత్తమ పోలీస్‌స్టేషన్‌లకుగాను 2018లో చేసిన సర్వే ఆధారంగా బుధవారం ఫలితాలు విడుదల చేసింది. సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు 14వ ర్యాంకు రాగా.. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్‌స్టేషన్‌కు 24వ ర్యాంకు వచ్చింది.
* సంస్థాన్‌ నారాయణపురం పోలీస్‌స్టేషన్‌ టాప్‌ 20లో ర్యాంకు సాధించడంతో అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా మొదటి స్థానం రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌ జిల్లా పరిధిలోని కలు పోలీస్‌ స్టేషన్‌కు దక్కింది. 

views: 793



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams