Current Affairs Telugu Daily

ఆస్పత్రి కాన్పుల్లో తెలంగాణ టాప్‌
* నీతి ఆయోగ్‌ రెండో విడత ఆరోగ్య సూచీలో తెలంగాణకు 10వ స్థానం లభించింది.
* ఇది మొత్తం పనితీరు ఆధారంగా దక్కిన ర్యాంకు.
* ఇక ‘పెరుగుతున్న పనితీరు’ విభాగంలో 6వ ర్యాంకు సాధించింది.
* ఆస్పత్రి కాన్పుల్లో దేశంలో అగ్రభాగాన నిలిచింది.
* 23 అంశాల ఆధారంగా నీతి ఆయోగ్‌ అధ్యయనం నిర్వహించింది.
* ఈ సూచీలో కేరళ అగ్రభాగాన నిలిచింది. రెండు, మూడు స్థానాలను వరుసగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర సాధించాయి.
* తరువాతి స్థానాల్లో వరుసగా గుజరాత్‌, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్ము, కర్ణాటక, తమిళనాడు నిలిచాయి.
 
* 2015-16 ఆరోగ్య సూచీలో తెలంగాణ 55.39 మార్కులతో 11వ స్థానంలో ఉండగా 2017-18 నాటికి 59 మార్కులతో 10వ స్థానం సాధించింది.
* రాష్ట్రంలో నవజాత శిశు మరణాల రేటు (ప్రతి వెయ్యి జననాలకు) 23 నుంచి 21కి తగ్గింది. 
  * అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటు 34గానే ఉంది.
* సంతాన సాఫల్య రేటు 1.8 నుంచి 1.7కి చేరింది.
* ఇది బిహార్‌లో అత్యధికంగా 3.3. నమోదైంది.
* తక్కువ బరువుతో జన్మించే శిశువుల రేటు 5.7 నుంచి 7.1కు పెరిగింది.
* ఈ విషయంలో ఒడిసా 18.2 శాతంతో ఆందోళనకర స్థితిలో ఉంది.
* ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌ తెలంగాణలో 90.3 శాతంగా నమోదైంది.
* ప్రసవానికి ముందు పరీక్షల విషయంలో మాత్రం బాగా వెనుకబడింది.
* కేవలం 47.3 శాతంగా నమోదైంది.
* టీబీకి చికిత్స అందించడంలో రెండో స్థానంలో నిలిచింది.
* జిల్లా ఆస్పత్రుల్లో స్పెషలిస్టుల కొరత తీవ్రంగా (53.5 శాతం) ఉన్నట్లు వెల్లడైంది.

views: 661

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams