Current Affairs Telugu Daily

ఆరోగ్య సూచీలో ఏపీ నం.2

* రాష్ట్రాల ఆరోగ్య సూచీలో ఆంధ్రప్రదేశ్‌ రెండో ర్యాంకు సాధించింది.
* కేరళ మొదటి స్థానం సాధించింది.
* తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది.
* 2015-16 నాటి ప్రమాణాలతో 2017-18 నాటి పరిస్థితులను సరిపోల్చి నీతి ఆయోగ్‌ ఈ ర్యాంకులను ప్రకటించింది.
* ఆర్థిక సంస్కరణలు మొదలైన తర్వాత దేశం సాధించిన పురోగతి కారణంగా రాష్ట్రాల ఆరోగ్య సూచీలు బాగానే మెరుగుపడ్డాయి.
*  రాష్ట్రాల మధ్య ఎంతో తేడాలు కనిపిస్తున్నాయి.
* కొన్ని ఎంతో ముందుకు సాగుతుండగా మరికొన్ని మరీ వెనుకబడి ఉన్నాయి.
* ఈ పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి రాష్ట్రాల మధ్య నీతి ఆయోగ్‌ పోటీ నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా జూన్ 24 ర్యాంకులను విడుదల చేసింది.
* మొత్తం 23 అంశాల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసింది.

శిశుమరణాలు తగ్గాయ్‌::
* ఆంధ్రప్రదేశ్‌లో శిశుమరణాలు 2015లో ప్రతి వెయ్యి జననాలకు 24 ఉండగా 2016 నాటికి 23కి తగ్గాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ సంఖ్య కేవలం 12 మాత్రమే ఉంది.
* తెలంగాణలో శిశుమరణాలు 23 నుంచి 21కి తగ్గాయి.
* ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 39 నుంచి 37కి తగ్గగా, తెలంగాణలో  34వద్ద ఆగిపోయింది. పురోగతి కనిపించలేదు.
* సంతాన సాఫల్య శాతం ఆంధ్రప్రదేశ్‌లో 1.7కి పరిమితమైంది. తెలంగాణలో ఈ నిష్పత్తి 1.8 నుంచి 1.7కి తగ్గింది.
* తక్కువ బరువుతో పుట్టే పిల్లల శాతం ఏపీలో 6.7 నుంచి 5.6కి తగ్గింది. తెలంగాణలో 5.7 నుంచి 7.1కి పెరిగింది.
* 2013-15తో పోలిస్తే 2014-16 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి తగ్గిపోయింది.  ఏపీలో 918 నుంచి 913కి తగ్గగా తెలంగాణలో 918 నుంచి 901కి పడిపోయింది.
* 2015-16, 2017-18 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆసుపత్రి కాన్పులు 87.1% నుంచి 85.9%కి తగ్గిపోయాయి. తెలంగాణలో 85.4 నుంచి 91.7%కి పెరిగాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో టీబీ కేసులు 145 నుంచి 161కి (ప్రతి లక్షమందికి) పెరిగాయి. తెలంగాణలో ఈ సంఖ్య 123 నుంచి 107కి తగ్గింది.
* 24 గంటలూ పనిచేసే పీహెచ్‌సీల సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో 29.1% నుంచి 22.7%కి, తెలంగాణలో 27 నుంచి 25.6%కి తగ్గిపోయాయి.


views: 812

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams