Current Affairs Telugu Daily

2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం
* 2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వనుంది.
* ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్‌ ఒలింపిక్స్‌, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్‌ పారాలింపిక్స్ జరగనున్నాయి.
* ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు.
* ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అధికారికంగా ప్రకటించారు.
* ఈ ఆటల అతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్‌ బిడ్‌ దాఖలు చేయగా, ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు.
* ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించింది.

views: 679

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams