Current Affairs Telugu Daily

కశ్మీర్‌ రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టిన కిషన్‌రెడ్డి

* పదిహేడో లోక్‌సభ తొలి సమావేశాలు కొనసాగుతున్నాయి. జూన్ 23న పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.
* జమ్ముకశ్మీర్‌ రిజర్వేషన్ల సవరణ బిల్లును హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. 

* జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దుకు 10కిలోమీటర్ల దూరంలో, కశ్మీర్‌లో నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పించేందుకు గానూ ఈ బిల్లును తీసుకొచ్చారు.
* ఈ బిల్లును ఫిబ్రవరి 18నే కేంద్ర కేబినెట్‌ ఆమోదించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నుంచి కూడా ఆమోద ముద్ర లభించింది. 


views: 747

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams