Current Affairs Telugu Daily

విదేశీయులకు శాశ్వత నివాస పథకం
సంపన్నులైన విదేశీయులను ఆకర్షించడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ప్రభుత్వం సరికొత్త శాశ్వత నివాస అనుమతి పథకాన్ని ప్రకటించింది. 
*ఇంధనేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్న ఆ దేశం అందులో భాగంగానే ఈ పథకాన్ని ప్రకటించినట్లు భావిస్తున్నారు. 
*కొత్త పథకంలో భాగంగా సుమారు రూ.21 కోట్లు (8 లక్షల రియాళ్లు లేదా 2.13 లక్షల అమెరికా డాలర్లు) చెల్లిస్తే సౌదీలో శాశ్వత నివాస అనుమతి పొందొచ్చు. 
*అదే రూ.27 లక్షలు (లక్ష రియాళ్లు లేదా 27వేల అమెరికా డాలర్లు) చెల్లిస్తే ఓ సంవత్సరం ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. 
*సౌదీ ప్రాయోజకులు లేని విదేశీయులకు, సౌదీలో వ్యాపారం చేసుకోవాలనుకునేవారికి, ఆ దేశంలో స్థిరాస్తులు కొనడంతో పాటు బంధువులకు ప్రాయోజిత వీసాలు సమకూర్చుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు.
Saudi Arabia::
  • Capital: Riyadh
  • Currency: Saudi riyal
  • King: Salman of Saudi Arabia

views: 692

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams