Current Affairs Telugu Daily

ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా
* రిజర్వ్‌ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరాల్‌ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. 
* మరో ఆరు నెలల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన తన బాధ్యతల నుంచి వైదొలిగారు. 
* జనవరి 23, 2017న విరాల్‌ ఆర్బీఐలో చేరారు. 
* ఆర్థిక సరళీకరణ విధానాల అమలు తర్వాత ఆర్బీఐలో చేరిన డిప్యూటీ గవర్నర్లలో అత్యంత పిన్న వయస్కుడు విరాల్‌ కావడం విశేషం. 
* జూన్  నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. 
* ఆయన గతంలో పనిచేసిన న్యూయార్క్‌ యూనివర్సిటీ స్టెర్న్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌కు అర్థశాస్త్రం ప్రొఫెసర్‌గా వెళుతున్నట్లు సమాచారం.   
*ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్బీఐకి స్వతంత్రత ఉండాల్సిందేనని గట్టిగా వినిపించిన వ్యక్తి విరాల్‌ ఆచార్య. 

views: 655

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams