Current Affairs Telugu Daily

మహిళలకు అండగా ‘నీ నేస్తం’
* ఇల్లు, పాఠశాల, కళాశాల, కార్యాలయం, బస్‌స్టాప్‌... ఇలా ఏదో ఓ చోట మహిళలు, బాలికలు వేధింపులు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే, వాటిపై ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియక సతమతమవుతుంటారు.
* వీరిలో చాలా మంది పేద, మధ్య తరగతి వారే కావడంతో ఫిర్యాదు చేయకుండానే తమలో తాము కుమిలిపోతుంటారు.
* అలాంటి వారికి అండగా నిలవాలన్న ఉద్దేశంతో ‘నీ నేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నారాయణపేట జిల్లా ఎస్పీ చేతన.
* ఇందులో భాగంగా జిల్లాలోని ప్రతి గ్రామంలో ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేయనున్నారు.
మహిళలు, బాలికలు ఎవరైనా సరే.. తమ సమస్యలను కాగితంపై రాసి ఆ బాక్సులో వేస్తే.. ఆ గ్రామానికి చెందిన పోలీస్‌ అధికారి వారానికి ఓ సారి వచ్చి వాటిని తీసుకెళ్తారు.
* సదరు ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించి.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.
* ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్‌ ఇప్పిస్తారు. ‘నీ నేస్తం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రావ్‌, ఎస్పీ చేతన ప్రారంభించారు

views: 857

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams