Current Affairs Telugu Daily

సంజయ్‌ గాంధీ నా తండ్రి: ప్రియాసింగ్‌పాల్‌
ఇందిరాగాంధీ చిన్న కుమారుడు, దివంగత కాంగ్రెస్‌ నేత సంజయ్‌గాంధీ తన తండ్రి అని ప్రియాసింగ్‌పాల్‌ అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. హిందీ సినిమా ‘ఇందూ సర్కార్‌’లో తన తండ్రి, ఇందిరాగాంధీ చరిత్రకు వక్రభాష్యం చెప్పారని ఆరోపిస్తూ 48 ఏళ్ల ప్రియాసింగ్‌ 2017 జులై 10న మీడియా ముందుకొచ్చారు. పసికందుగా ఉన్న తనను షీలాసింగ్‌, బ్వంద్‌పాల్‌ దంపతులు దత్తత తీసుకున్నారని ప్రియాసింగ్‌పాల్‌ చెప్పారు. పెళ్లికాకముందు సంజయ్‌కు జన్మించిన కూతురినని తన పెంపుడు తల్లితండ్రులు చెప్పినట్లు ప్రియాసింగ్‌పాల్‌ వెల్లడించారు.
` ఇందిరాగాంధీ యొక్క రెండో కుమారుడు సంజయ్‌గాంధీ  
` సంజయ్‌గాంధీ 1980 జూన్‌ 23న న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందాడు
` సంజయ్‌గాంధీ సతీమణి ` మనేకాగాంధీ
` సంజయ్‌గాంధీ కుమారుడు ` వరుణ్‌గాంధీ
` మనేకాగాంధీ ప్రస్తుతం నరేంద్రమోడి ప్రభుత్వంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్య వహిస్తున్నారు. 
` వరుణ్‌గాంధీ సుల్తాన్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) ఎంపీగా ఉన్నారు

views: 903

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams