Current Affairs Telugu Daily

డేటా వినియోగంలో భారత్‌ టాప్
* భారత్‌ లో స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.
స్కూల్‌ పిల్లాడి నుంచి వృద్ధుల వరకూ చేతిలో ఫోన్‌ లేనిదే రోజు గడవని పరిస్థితి. దీంతోపాటే వారు వినియోగిస్తున్న మొబైల్‌ డేటా కూడా పెరుగుతోంది. ఎంతంటే.. భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ డేటాను వినియోగిస్తున్నంత. ‘ఎరిక్సన్‌ మొబిలిటీ’ నివేదిక 2019 జూన్‌ ఎడిషన్‌ ప్రకారం.. నెలలో సరాసరిగా అత్యధిక డేటా వినియోగంలో ప్రపంచంలోనే భారత్‌ తొలిస్థానంలో నిలిచింది.
* 2018 చివరి నాటికి దాదాపుగా 9.8 బీబీ డేటాను భారత్‌లో ప్రతి నెలా ఒక్కో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుడు ఖర్చు చేస్తున్నారు.

* ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ప్రతి నెలా సరాసరి డేటా వినియోగం 7.1 జీబీ కాగా.. ఉత్తర అమెరికాలో ఇది 7 జీబీగా నమోదైంది.
* భారత్‌లో జియో రాకతో డేటా వినియోగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పొచ్చు. వినియోగదారులకు తక్కువ ధరకే డేటా ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు అన్‌లిమిటెడ్‌ ఆఫర్లతో, ఆకర్షణీయమైన ప్లాన్లతో .. డేటా వినియోగం కూడా భారీగా పెరిగింది.
* 2018లో భారత్‌లో GSM/ EDGE సబ్‌స్క్రిప్షన్లు 47 శాతం ఉండగా.. LTE వాటా 38 శాతం ఉందని ఎరిక్సన్‌ తన నివేదికలో తెలిపింది.
* 2024 చివరి నాటికి ఎల్‌టీ ఈ శాతం 82 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams