Current Affairs Telugu Daily

గ్రే జాబితాలోనే పాకిస్థాన్‌
* ​​​​​​జైష్‌ ఎ మహ్మద్‌, లష్కరేతోయిబా తదితర ఉగ్రవాద  సంస్థలకు ఆర్థికసాయం అందకుండా చేయడంలో విఫలమైన పాకిస్థాన్‌ను ‘‘గ్రే జాబితా’’లోనే  ఉంచాలని అంతర్జాతీయ ఉగ్రవాద ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణ సంస్థ ‘‘ఎఫ్‌ఏటీఎఫ్‌’’ నిర్ణయించింది.
* ఇంతకుముందు సూచించినట్లు 27 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే పరిణామాలకు సిద్ధంగా ఉండాలని గట్టిగా హెచ్చరించింది.
* ఫ్లోరిడాలో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్‌ ముగింపు సమావేశం రోజైన ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
* 2019 జనవరి, మే గడువులోపు పూర్తి చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికను చేరుకోవడంలో పాకిస్థాన్‌ విఫలమైందని ఎఫ్‌ఏటీఎఫ్‌ అధికార ప్రతినిధి అందులో పేర్కొన్నారు.
**అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల నిఘా సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎఫ్‌ఏటీఎఫ్‌) పాక్‌ను గ్రే లిస్ట్‌లో పెట్టింది. 

ఎఫ్‌ఏటీఎఫ్‌ 1989 లో  ఏర్పాటు చేశారు

ఎఫ్‌ఏటీఎఫ్‌ గ్రూపులో 37 దేశాలున్నాయి. మనీ లాండరింగ్‌ నిరోధానికి, ఉగ్ర సంస్థలకు నిధులు అందకుండా కట్టడి చేయటానికి ఇది కృషి చేస్తుంది. కాగా, గ్రే లిస్ట్‌లో ఇప్పటికే ఇథియోపియా, ఇరాక్, యెమెన్, సెర్బియా, సిరియా, శ్రీలంక, ట్రినిడాడ్‌ టొబాగో, ట్యునీసియా, వనౌటు దేశాలున్నాయి. 

**గ్రే లిస్ట్‌లో ఉంటే ఏమవుతుంది?
 
 ఉగ్రవాదులతో సంబంధ మున్న దేశంగా ముద్రపడితే ఈ పరిస్థితి మరింత దిగజారుతుంది. అక్కడ పెట్టుబ డులు పెట్టడానికి, కంపెనీలు నెలకొల్పేందుకు విదేశీ సంస్థలు సంశయిస్తాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పు పుట్టడం కష్టం. స్టాండర్డ్‌ చార్టెర్డ్‌ బ్యాంక్‌ వంటి విదేశీ బ్యాంకులు దేశం నుంచి వెళ్లిపోయే అవకాశాలున్నాయి. అదే బ్లాక్‌లిస్ట్‌లో ఉంటే ప్రభుత్వాలు, సంస్థలు, కంపెనీలు ఆయా దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎటువంటి అవకాశం ఉండదు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వవు.

views: 691

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams