Current Affairs Telugu Daily

 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర
* ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అగ్రవర్ణాల్లోని బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఫైలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
* సంబంధిత ఫైలుపై ఉన్నతాధికారుల సంతకం కూడా పూర్తయింది.
* ఆ ఫైలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంతకం తీసుకొని తక్షణమే ఉత్తర్వులు జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు.
* ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు తెలిపాయి.
* ఈ సీట్ల పెంపునకు కూడా ఎంసీఐ తాజాగా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

views: 724

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams