Current Affairs Telugu Daily

ఆగస్టు చివరి నుంచి ICEX  పునః ప్రారంభం
ఇండియన్‌ కమొడిటీ ఎక్సేóరేజీ(ICEX) తిరిగి ట్రేడింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ సెబీ తుది అనుమతులు ఇచ్చింది. ఇందులో అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌కు అత్యధిక వాటా ఉంది. సెబీ నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటించడంతో 3 సం॥ల తర్వాత పునః ప్రారంభం కానుంది. కమొడిటీలకు ఆన్‌లైన్‌ డెరివేటివ్‌ ఎక్స్చేంజీగా పనిచేస్తున్న ICEX వజ్రాల వ్యాపారం, ట్రేడింగ్‌ కార్యకలాపాలకు సైతం సెబీ నుంచి అనుమతులు పొందింది. 2017 ఆగస్టు చివరి నుంచి ICEX  కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. 
ICEX- Indian Commodity Exchange
ICEX ఎండీ, సీఈఓ ` సంజిత్‌ ప్రసాద్‌ 
SEBI-Securities and Exchange Board of India
SEBI Chair Person - Ajay Tyagi
SEBI  Headquarters - ముంబై

views: 983



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams