Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టు సీజేగా ఆర్‌ఎస్‌ చౌహాన్‌
* తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు.
* ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయనను సీజేగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫార్సు చేసింది.
* రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్..
* 2005 జూన్ 13న రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
* ఆ తర్వాత 2015 మార్చి 10న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.
* అక్కడి నుంచి బదిలీపై 2018 నవంబరు 23న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
* తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత మార్చి 28నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు.

views: 726

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams