Current Affairs Telugu Daily

కొల్హాపురి చెప్పులకు  జీఐ(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌
* సాంప్రదాయ పాదరక్షలు అనగానే గుర్తొచ్చేది కొల్హాపురి చెప్పులు.
* దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ కలిగిన కొల్హాపురి బ్రాండ్‌కు తాజాగా జీఐ(జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌) ట్యాగ్‌ లభించింది.
* జీఐ ట్యాగ్‌ లభించడం ద్వారా కొల్హాపురి చెప్పుల మార్కెట్‌ మరింతగా పెరగనుంది.
* మహారాష్ట్రలోని కొల్హాపూర్‌, షోలాపూర్‌, సంగ్లీ, సతారా, కర్ణాటకలోని ధార్వాడ్, బెల్గామ్‌, బగల్‌కోట్, బీజాపూర్‌ జిల్లాలను కొల్హాపురి చెప్పుల మూల స్థానంగా పేర్కొన్నారు.
* నిర్ధిష్ట భూగోళ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వాటికి ఈ జీఐ ట్యాగ్‌ని అందజేస్తారు.
* ఇది మరో చోట ఉత్పత్తి కాదని అర్థం.
* ఈ ట్యాగ్ క్వాలిటీని కూడా సూచిస్తుంది.  
* ఈ జియో ట్యాగ్ వల్ల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో గుర్తింపు లభిస్తోంది

views: 782

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams