Current Affairs Telugu Daily

హైదరాబాద్‌లో ‘ఇండీడ్‌’ నూతన టెక్నాలజీ కేంద్రం
* ఉద్యోగార్థులకు సేవలు అందించే జాబ్‌ సైట్‌ అయిన ‘ఇండీడ్‌’ హైదరాబాద్‌లో నూతన టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటోంది.
* దీనికోసం హైటెక్‌ సిటీ సమీపంలోని స్కైవ్యూ టవర్స్ లో 91,000 చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని తీసుకుంది.
* ఈ సంస్థ 2004లో యూఎస్‌లోని టెక్సాస్‌లో ఏర్పాటైంది.
* భారతదేశానికి 2008లో విస్తరించింది.
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 14 దేశాల్లోని 29 నగరాల్లో ఈ సంస్థ కార్యాలయాలు ఉన్నాయి.
* దాదాపు 8,500 మంది సిబ్బంది ఈ సంస్థ తరఫున పనిచేస్తున్నారు.
* టెక్నాలజీ కంపెనీల కేంద్రమైన హైదరాబాద్‌లో ఉద్యోగార్థులకు ఇంకా మెరుగైన సేవలు అందించేందుకు తాము సిద్ధపడుతున్నట్లు, అందులో భాగంగా కొత్త భవనంలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

views: 716Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams